Ad Code

Responsive Advertisement

AP SSC 10th Class Supplementary, Re counting, Re verification Dates 2025 in telugu: పదవ తరగతి సప్లమెంటరీ రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ డేట్స్.

AP SSC 10th Class Supplementary, Re counting, Re verification Dates 2025 in telugu: పదవ తరగతి సప్లమెంటరీ రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ డేట్స్.

AP SSC 10th Class Supplementary, Re counting, Re verification Dates 2025 in telugu: పదవ తరగతి సప్లమెంటరీ రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ డేట్స్.



  AP SSC 10th Class Results 2025 ఏప్రిల్ 23, 2025 వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల కావడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షా ఫలితాలలో 81.14 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. బాలికల పాస్ పర్సంటేజ్ శాతం 84.09%, బాలుర పాస్ పర్సంటేజ్ శాతం 78.31% మంది పాసయ్యారు. బాలురు కన్నా బాలికలు పాస్ పర్సంటేజ్ లో ముందంజలో ఉన్నారు.

   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 11,819 స్కూల్లలోని 6,19,286 విద్యార్థులకు హాల్ టికెట్లను మంజూరు చేయడం జరిగింది. ఈ 6,19,286 మంది విద్యార్థులలో 6,14,459 మంది విద్యార్థులు ఈ పదవ తరగతి పరీక్షలను రాయడం జరిగింది. ఈ పరీక్షను రాసిన 6,14,459 విద్యార్థులలో 4,98,585 మంది విద్యార్థులు పాసయ్యారు.

  ఫెయిల్ అయిన విద్యార్థులు బాధపడవద్దు. సప్లమెంటరీ ఎగ్జామ్ కోసం సంసిద్ధం కాండి. ఎలాగైనా సరే సప్లమెంటరీ లో పాస్ అయ్యేలా చదువుకోండి. 

  ఈ AP SSC 10th Class Supplimentary Exams మే 19, 2025వ తేదీ నుండి మే 28, 2025 తేదీ వరకు నిర్వహించనున్నారు.

  ఈ AP SSC 10th Class Supplimentary Exam Fees ను ఏప్రిల్ 24, 2025వ తేదీ నుండి ఏప్రిల్ 30, 2025 వ తేదీ లోపు ఫీజు చెల్లించాలి. ఆలస్య రుసుము 50 రూపాయల తో మే 19, 2025 లోపు చెల్లించవచ్చు. 

  AP SSC 10th Class Re counting, Re verification కోసం విద్యార్థులు ఏప్రిల్ 24 2025వ తేదీ నుండి మే 01, 2025 వ తేదీలోపు ఫీజు చెల్లించాలి. 

  AP SSC 10th Class Re counting Fee ఒక్కో సబ్జెక్టుకు 500 రూపాయలను ఫీజు చెల్లించాలి. ఒక్కో సబ్జెక్టు 500 రూపాయలు లాగా ఎన్ని సబ్జెక్టుల కైనా పెట్టుకోవచ్చు. 

  AP SSC 10th Class Re verification Fee ఒక్కో సబ్జెక్టుకు 1000 రూపాయలను ఫీజు కట్టాలి. అలా సబ్జెక్టుకు ₹1000 చొప్పున ఎన్ని సబ్జెక్టులకైనా కట్టుకోవచ్చు.

AP SSC 10th Class Re counting: 

  
  రీకౌంటింగ్ అంటే మీ పేపర్ ను ఇంతకుముందు ఎవరైతే కరెక్ట్ చేశారో, వారు ప్రతి ప్రశ్నకు మార్కులు వేయడం జరిగి ఉంటుంది. మీరు రీకౌంటింగ్ కి అప్లై చేస్తే వారు మీ పేపర్ ను మళ్లీ కరెక్షన్ చేయరు. కేవలం ఇంతకుముందు కరెక్షన్ చేసి ఏవైతే మార్కులు వేశారో ఆ మార్కులను మళ్లీ కౌంట్ చేసి మీకు తెలపడం జరుగుతుంది.
   ఈ రీ కౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు 500 రూపాయలను ఎన్ని సబ్జెక్టులకైతే అప్లై చేసుకుంటున్నారో అన్ని 500 రూపాయలు కట్టాలి. 


AP SSC 10th Class Re verification: 


 రీ వెరిఫికేషన్ అంటే మీ పేపర్ ను ఇంతకుముందు కరెక్షన్ తో సంబంధం లేకుండా, మళ్లీ మీ పేపర్ ను ఫస్ట్ నుండి క్షుణ్ణంగా కరెక్షన్ చేయడం జరుగుతుంది. మీ పేపర్ ను బాగా కరెక్షన్ చేసి మార్కులు మీకు తెలపడం జరుగుతుంది. 

  కాబట్టి మీరు బాగా ఎగ్జామ్ రాసి మీకు అనుకున్నంత మార్కులు రాకపోయి ఉంటే ఈ రీ వెరిఫికేషన్ అనేది బెస్ట్ ఆప్షన్. నీ కౌంటింగ్ కన్నా రీ వరిఫికేషన్ బెస్ట్. మీరు ఎగ్జామ్ ను బాగా రాసి ఉన్నారు, ఆశించినంత ఫలితాలు రాలేదు అన్నట్లయితే కచ్చితంగా రి వెరిఫికేషన్ కు వెళ్ళండి. మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది.


AP SSC 10th Class 2025 Imp Dates: 


AP 10th Supplimentary Exam Fees Dates: 24 April 2025 - 30 April 2025. 50 రూపాయలు లేటు ఫీజుతో మే 19, 2025 లోపు అప్లై చేసుకోవచ్చు.

Supplimentary Exam Fees Dates: 19 May 2025 - 28 May 2025. 
  
AP 10th Re counting, Re verification Fee Dates: April 24, 2025 - 1st May 2025

Re counting, per subject - 500 rupees 

Re verification, per subject - 1000 rupees



Official Website: www.bse.ap.gov.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు