Sbi Clerk Recruitment 2026: ఏదైనా డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నుండి జూనియర్ అసోసియేట్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ SBI Clerk Recruitment 2026 ద్వారా 1538 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ సపరేట్గా ఎస్సీ, ఎస్టి మరియు ఓబిసి అభ్యర్థుల కోసం విడుదల అయింది.
ఈ Sbi Clerk Recruitment 2025 కోసం అభ్యర్థులు ఆగస్టు 07, 2026 నుండి ఆగస్టు 27, 2026 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
Age Limit:
20 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అంటే అభ్యర్థులు ఏప్రిల్ 02, 1998 వ తేదీ నుండి ఏప్రిల్ 01, 2006 వ తేదీ మధ్య పుట్టి ఉండాలి. ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేట్ ఏప్రిల్ 01, 2026.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరంల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులలోఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
ఏదైనా యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు తమ డిగ్రీని డిసెంబర్ 31, 2026వ తేదీ లోపు కంప్లీట్ చేసి ఉండాలి.
అయితే అభ్యర్థులు ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
ఈ 1538 ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 88(ST) ఉద్యోగాలు మరియు తెలంగాణ లో 250 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేటగిరి వయసు పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Selection Process:
* ప్రిలిమినరీ ఎగ్జామ్
* మెయిన్ ఎగ్జామ్
* లోకల్ లాంగ్వేజ్ టెస్ట్
ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 30 ప్రశ్నలు - 30 మార్కులు - 20 నిమిషాలు
న్యూమరికల్ ఎబిలిటీ - 35 ప్రశ్నలు - 35 మార్కులు - 20 నిమిషాలు
రీజనింగ్ ఎబిలిటీ - 35 ప్రశ్నలు - 35 మార్కులు - 20 నిమిషాలు
ప్రిలిమినరీ ఎగ్జామ్ 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 60 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సెక్షన్ కి సపరేట్ టైమింగ్ కేటాయించడం జరిగింది. ప్రతి తప్పు సమాధానానికి 1/4TH నెగిటివ్ మార్కింగ్ ఉంది.
Main Examination:
ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులను 1:10 రేషియో లో మెయిన్స్ ఎగ్జామ్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ఈ మెయిన్ ఎగ్జామినేషన్ 190 ప్రశ్నలకు గాను 200 మార్కులు చొప్పున 2 గంటల 40 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది.
ప్రతి తప్పు సమాధానానికి 1/4TH నెగిటివ్ మార్కింగ్ ఉంది.
Local Language Test:
పదవ తరగతి లేదా ఇంటర్లో తెలుగు లాంగ్వేజ్ ను ఒక సబ్జెక్టు కింద చదివిన అభ్యర్థులకు ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్టును నిర్వహించడం జరగదు. మిగతా వారికి ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్టును నిర్వహించడం జరుగుతుంది.
అయితే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రానికి కాకుండా వేరే రాష్ట్రానికి అప్లై చేసుకున్నట్లయితే ఆ రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది.
Application Fee:
ఈ Sbi Clerk Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 750 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
Examination Centers:
ఆంధ్ర ప్రదేశ్: అనంతపూర్, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
Salary:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి సిటీలో పోస్టింగ్ వస్తే 46,000 రూపాయల వరకు
సాలరీ రావడం జరుగుతుంది.
పూర్తి నోటిఫికేషన్ను చూసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.
Official Website: WWW.SBI.CO.IN

0 కామెంట్‌లు