AAICLAS Recruitment 2026 in telugu: 12వ తరగతి అర్హతతో ఎయిర్పోర్టులో ఉద్యోగాలు.

 AAICLAS Recruitment 2026 in telugu: 12వ తరగతి అర్హతతో ఎయిర్పోర్టులో ఉద్యోగాలు.

AAICLAS Recruitment 2026 in telugu


  ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్ & అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) నుండి అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ AAICLAS Recruitment 2026 in telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

  ఈ AAICLAS Recruitment 2026 ద్వారా కాంట్రాక్టువల్ బేసిస్ కింద ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

 ఈ AAICLAS Recruitment 2026 కోసం అభ్యర్థులు జూన్ 11, 2026వ తేదీ నుండి జులై 2, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. 12th అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి ఎటువంటి ఎగ్జామ్ నిర్వహించడం జరగదు. 


Age Limit:


  జూన్ 1, 2026 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరముల  ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.



Educational Qualification:


  60% మార్కులతో 12th క్లాసు పాస్ అయిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 55% మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది. 

  అలాగే అభ్యర్థులకు ఇంగ్లీషు, హిందీ మరియు లోకల్ లాంగ్వేజ్ చదవడం/రాయడం వచ్చి ఉండాలి. 

Selection Process:

  వచ్చిన అప్లికేషన్స్ ని పరిశీలించి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్లిస్ట్ అయినా క్యాండిడేట్స్ ని ఇంటర్వ్యూ కు పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నారు. 

How To Apply:

  అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి www.aaiclas.aero లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వత అప్లై చేసుకోవాలి. జూన్ 11, 2026వ తేదీ నుండి జులై 2, 2026వ తేదీ లోగా అప్లై చేసుకోవాలి.
ఒక అభ్యర్థి ఒక లొకేషన్ కి మాత్రమే అప్లై చేసుకోవాలి. 

Application Fee:

  ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 
  మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 100 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

Posts Details:

  ఈ నోటిఫికేషన్ ద్వారా 

తిరుపతి - 9 పోస్టులు 
తిరుచి - 23 పోస్టులు 
మధురై - 9 పోస్టులు 
భువనేశ్వర్ - 9 పోస్టులు 
ఉదయపూర్ - 12 పోస్టులు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 62 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

Salary:

ఈ ఉద్యోగాలను 3 సంవత్సరముల కాంట్రాక్టువల్ బేసిస్ కింద భర్తీ చేస్తూ ఉన్నారు.

మొదటి సంవత్సరం - నెలకు 21,500 రూపాయలు
రెండవ సంవత్సరం - నెలకు 22,000 రూపాయలు 
మూడవ సంవత్సరం - నెలకు 22,500 రూపాయలు 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు