Anganwadi Recruitment 2025: పదవ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు

 Anganwadi Recruitment 2025:  పదవ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు



Anganwadi Recruitment 2025:  పదవ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు


  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము నుండి అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. కేవలం పదవ తరగతి పాసై ఉంటే ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

  ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు డిసెంబర్ 22, 2025 వ తేదీ నుండి డిసెంబర్ 30, 2025 వ తేదీ లోపు ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Age Limit:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు జూలై 1, 2025వ తేదీ నాటికి 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి.

పదవ తరగతి అర్హతతో 714 MTS ఉద్యోగాలు 

Salary:


  ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు మరియు అంగన్వాడి కార్యకర్తకు అయితే నెలకు 11,500 రూపాయలను చెల్లిస్తారు. అంగన్వాడి సహాయకురాలు అయితే నెలకు 7,000 రూపాయలను గౌరవ వేతనం కింద చెల్లించడం జరుగుతుంది.

Eligibility:


  అభ్యర్థులు పదవ తరగతి పాస్ అయి ఉండవలెను. 
  అభ్యర్థులు వివాహితులు అయి ఉండవలెను.
  అభ్యర్థులు స్థానికులు అయి ఉండవలెను.
  మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. 

 ఈ అంగన్వాడి నోటిఫికేషన్ శ్రీ సత్య సాయి జిల్లా నుండి విడుదల అయింది. ఈ ఉద్యోగాల కోసం స్థానికులు మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామం స్థానికులు అయి ఉండవలెను. ఈ srisathyasai District Anganwadi Recruitment 2025 ద్వారా 69 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

 బత్తలపల్లి - 3

 సి కె పల్లి - 6

 ధర్మవరం - 6

 గుడిబండ - 2

 హిందూపూర్ - 13

 కదిరి - 6

 మదకసిర - 7

 నల్ల చెరువు - 3

 ఓడి చెరువు - 2

 పెనుకొండ - 6

 పుట్టపర్తి - 6

 సోమంది పల్లి - 9

 మొత్తంగా 69 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడి సహాయకురాలు పోస్టులను కేటగిరి వైజ్ అఫీషియల్ నోటిఫికేషన్ లోకి వెళ్లి చూసుకోండి.

How To Apply:


  అభ్యర్థులు అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత పూర్తిగా నింపాలి. ఇటీవల దిగిన కొత్త ఫోటో ను అంటించాలి. ఫోటో పైన ఇంకు పెన్నుతో సంతకం చేయాలి. 

 దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫారం తో పాటు జతపరచవలసిన డాక్యుమెంట్లు 

  అభ్యర్థి స్థానికురాలు అని తెలపడానికి (నేటివిటీ సర్టిఫికేట్/రెసిడెన్స్ సర్టిఫికెట్/ఆధార్ మొదలగునవి..) జత పరచవలెను. 
  పదవ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్. 
  తహసిల్దార్ చేత జారీ చేయబడిన క్యాస్ట్ సర్టిఫికెట్.
  వికలాంగులు అయితే వారి సర్టిఫికేట్.
  ఓపెన్ స్కూల్ సొసైటీలో చదివిన వారు అయితే స్టడీ సర్టిఫికెట్ జతపరిచాలి.

 పై పత్రాలపై గజిటెడ్ సైన్ చేయించి, అప్లికేషన్ ఫారంకు అటాచ్ చేయాలి. అన్నింటినీ తీసుకొని అభ్యర్థులు సంబంధిత ఐ.సి.డి.ఎస్ కార్యాలయములో డిసెంబర్ 22, 2025వ తేదీ నుండి డిసెంబర్ 30, 2025 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలి.

Selection Process:


  అప్లై చేసుకున్న అన్ని అప్లికేషన్స్ ని స్క్రూటీ ని చేయడం జరుగుతుంది. తర్వాత అభ్యర్థులకు డిక్టేషన్ నిర్వహిస్తారు. ఈ డిక్టేషన్లో పాస్ కావాల్సి ఉంటుంది.

Notification PDF 

Official Website: https://srisathyasai.ap.gov.in/

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు