Thalliki Vandanam Payment Check 15,000 in Telugu 2025/Amma Vadi: తల్లికి వందనం డబ్బులు ఇలా చెక్ చేసుకోండి.
Thalliki Vandanam (తల్లికి వందనం(Amma Vadi)) Payment Check 15,000 ను ఎలా చెక్ చేసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ Thalliki Vandanam పథకం కింద ఒకటవ తరగతి నుండి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు 15,000 రూపాయలను కూటమి ప్రభుత్వం జూన్ 12, 2025వ తేదీ నుండి విడుదల చేసింది.
Thalliki Vandanam (తల్లికి వందనం(Amma Vadi)) Payment
కూటమి ప్రభుత్వం ఈ Thalliki Vandanam (తల్లికి వందనం) పథకం కింద 15,000 రూపాయలను వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2000 రూపాయలను పాఠశాల నిర్వహణ ఖర్చులకు ఉంచుకొని 13 వేల రూపాయలను తల్లుల అకౌంట్లలో జమ చేసింది. ఈ అమౌంట్ అనేది తల్లుల అకౌంట్లో జూన్ 12వ తేదీ నుండి జమ అవుతోంది.
Thalliki Vandanam (తల్లికి వందనం(Amma Vadi)) Eligibility
* విద్యార్థులు ఒకటవ తరగతి నుండి 12వ తరగతి మధ్య చదువుతూ ఉండాలి. (ఐటిఐ, పాలిటెక్నిక్, త్రిబుల్ ఐటీ విద్యార్థులకు ఈ తల్లికి వందనం పథకం వర్తించదు.)
* గత సంవత్సరం విద్యార్థి 75% హాజరు కలిగి ఉండాలి.
* గ్రామీణ ప్రాంతాలలో కుటుంబం ఆదాయం 10,000కు మించకూడదు. పట్టణ ప్రాంతాలలో కుటుంబం ఆదాయం 12,000 కు మించకూడదు.
* కుటుంబం వైట్ రేషన్ కార్డును కలిగి ఉండాలి.
* నాలుగు చక్రాల వాహనం కలిగిన వారు అర్హులు కాదు. (అయితే టాక్సీ, ఆటో మరియు ట్రాక్టర్ కలిగిన వారికి మినహాయింపు ఉంది.)
* మాగాని భూమి అయితే కుటుంబం మూడు ఎకరాల లోపు కలిగి ఉండాలి. మిట్ట భూమి అయితే కుటుంబం 10 ఎకరాల లోపు కలిగి ఉండాలి.
* కుటుంబం నెలకు 3 యూనిట్ల లోపు కరెంటును వాడాలి. కుటుంబం వాడిన కరెంటు ను ప్రభుత్వం సంవత్సరం మొత్తాన్ని తీసుకొని సరాసరి చేసి లెక్కిస్తుంది.
* పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగుల లోపు స్థిరాస్తిని కలిగిన వారు అర్హులు.
* కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు గాని లేదా పెన్షనర్లు గాని ఉంటే ఈ పథకం వర్తించదు. అయితే పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంది.
* కుటుంబంలో ఇన్కమ్ టాక్స్ కట్టేవారు ఉంటే ఈ పథకం వర్తించదు.
* ఆ కుటుంబం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే హౌస్ మ్యాపింగ్ లో ఉండాలి.
Thalliki Vandanam (తల్లికి వందనం (Amma Vadi) Eligible Candidate List
Thalliki Vandanam (తల్లికి వందనం (Amma Vadi) అర్హుల జాబితా కి సంబంధించి సచివాలయం దగ్గర ప్రింట్ తీసి అంటించి ఉంటారు వెళ్లి చెక్ చేసుకోగలరు. తల్లిదండ్రులు తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలి అంటే తమ గ్రామంలోని సచివాలయం దగ్గరకు వెళ్లి అక్కడ అంటించిన పేపర్లో చూసుకోగలరు.
మీకు తల్లికి వందనం పథకానికి అర్హత ఉండి, మీ పేరు లిస్టులో రాలేదు అంటే సచివాలయానికి వెళ్లి తెలియజేయండి. గ్రీవెన్స్ పెట్టుకోండి. 12వ తేదీ నుండి జూన్ 20వ తేదీలోపు మీ ఫిర్యాదులను తెలియజేయండి. మిమ్మల్ని వెరిఫికేషన్ చేసి మళ్లీ జూన్ 21 నుండి జూన్ 28వ తేదీలలోపు జాబితాను విడుదల చేయడం జరుగుతుంది. అర్హులైన వారికి జులై 05, 2025 వ తేదీన డబ్బులు జమ చేయడం జరుగుతుంది.
How to Check Thalliki Vandanam (తల్లికి వందనం (Amma Vadi)) Payment Status
Thalliki Vandanam Payment Status Check - Click Here
పై లింకు క్లిక్ చేయండి. స్కీం దగ్గర తల్లికి వందనం అని సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ దగ్గర 2025-2026 సెలెక్ట్ చేసుకోండి. యుఐడి దగ్గర ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చాను ఎంటర్ చేసి గెట్ ఓటిపి పై క్లిక్ చేయండి. ఓటిపి ఎంటర్ చేసి చెక్ చేసుకోండి.
Thalliki Vandanam Payment For First Class and Inter First Year Students
ఒకటవ తరగతి చేరే విద్యార్థులకు మరియు ఇంటర్ మొదటి సంవత్సరం చేరే విద్యార్థులకు Thalliki Vandanam పథకం కింద డబ్బులు జులై 5వ తేదీన జమా కానున్నాయి. వీరికి సంబంధించిన జాబితాను జూన్ 30వ తేదీ ప్రకటించడం జరుగుతుంది.
0 కామెంట్లు