Ad Code

Responsive Advertisement

NPCIL Recruitment 2025 in telugu: Inter, ITI, Degree అర్హతతో ఉద్యోగాలు.

 NPCIL Recruitment 2025 in telugu: Inter, ITI, Degree అర్హతతో ఉద్యోగాలు.


NPCIL Recruitment 2025 in telugu: Inter, ITI, Degree అర్హతతో ఉద్యోగాలు.



  NPCIL (NUCLEAR POWER CORPORATION OF INDIA LIMITED), Gujarat నుండి జాబ్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ NPCIL అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. ఈ NPCIL Recruitment 2025 ఉద్యోగాలు పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.


  ఈ NPCIL Recruitment 2025 ద్వారా సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరి 1) డిప్లమా హోల్డర్స్ మరియు సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరి 1) సైన్స్ గ్రాడ్యుయేట్స్ - 11 పోస్టులను, టెక్నీషియన్ (క్యాటగిరి 2) ప్లాంట్ ఆపరేటర్ మరియు టెక్నీషియన్ (క్యాటగిరి 2) మైంటెనర్ - 166 పోస్టులను, అసిస్టెంట్ గ్రేడ్ 01(HR) - 9 పోస్టులు, అసిస్టెంట్ గ్రేడ్ 01(F&A) - 6 పోస్టులను, అసిస్టెంట్ గ్రేడ్ 01(C&MM) - 5 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ మరియు బ్యాక్ లాక్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి.


  అభ్యర్థులు ఈ NPCIL Recruitment 2025 ఉద్యోగాల కోసం www.npcilcareers.co.in వెబ్ సైటులో మే 28 2025 వ తేదీ నుండి జూన్ 17, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.


Educational Qualification: 


సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరి 1) డిప్లమా హోల్డర్స్: వారు ఇచ్చిన ట్రేడ్లో మూడు సంవత్సరాల డిప్లమాను 60% మార్కులతో పాసైన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
లేదా 
ఇంటర్ ఒకేషనల్ చేసి డైరెక్ట్ సెకండ్ ఇయర్ డిప్లొమా చేసిన అభ్యర్థులకు కూడా అవకాశం ఉంది. అయితే ఐటిఐ చేసి డిప్లమా సెకండియర్ లో చేరిన అభ్యర్థులకు అప్లై చేసుకునే అవకాశం లేదు.

సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరి 1) సైన్స్ గ్రాడ్యుయేట్స్: 60% మార్కులతో బీఎస్సీలో పాస్ అయి ఉండాలి. మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్లో అభ్యర్థులు చదివి ఉండాలి. అలాగే బీఎస్సీలో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీని ప్రిన్సిపల్ సబ్జెక్టుగా కలిగి, మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ సబ్జెక్టులతో చదివి ఉండాలి.

ఇంగ్లీషు సబ్జెక్టును పదవ తరగతి లేదా ఇంటర్లో ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 

టెక్నీషియన్ (క్యాటగిరి 2) ప్లాంట్ ఆపరేటర్: ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 50% మార్కులతో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. పదవ తరగతిలో ఇంగ్లీషు సబ్జెక్టును ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 

టెక్నీషియన్ (క్యాటగిరి 2) మైంటెనర్: పదవ తరగతిలో సైన్స్ సబ్జెసీట్స్ మరియు మ్యాథమెటిక్స్ లో 50% మార్కులతో పాసై, వారు అడిగిన ట్రేడ్స్ లో 2 సంవత్సరాల ఐటిఐ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

  ఒక సంవత్సరం ఐటిఐ కోర్సు చేసిన అభ్యర్థులు, ఒక సంవత్సరం రీలవెంట్ ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి. లేదంటే ఒక సంవత్సరం అప్రెంటిషిప్ చేసి ఉండాలి.

అసిస్టెంట్ గ్రేడ్ 01(HR) & అసిస్టెంట్ గ్రేడ్ 01(F&A) & అసిస్టెంట్ గ్రేడ్ 01(C&MM): ఏదైనా బ్యాచులర్స్ డిగ్రీనీ 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.



Physical Standards: 

సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరి 1) డిప్లమా హోల్డర్స్ & సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరి 1) సైన్స్ గ్రాడ్యుయేట్స్ & టెక్నీషియన్ (క్యాటగిరి 2) ప్లాంట్ ఆపరేటర్ & టెక్నీషియన్ (క్యాటగిరి 2) మైంటెనర్: హైటు 160 సెంటీమీటర్లు ఉండాలి. వెయిట్ 45.5 కేజీలు ఉండాలి. మెడికల్ గా ఫిట్ గా ఉండే అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్స్ రిలాక్సిబుల్ చేయడం జరుగుతుంది.

Age Limit: 


సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరి 1) డిప్లమా హోల్డర్స్ & సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరి 1) సైన్స్ గ్రాడ్యుయేట్స్: 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.

టెక్నీషియన్ (క్యాటగిరి 2) ప్లాంట్ ఆపరేటర్ & టెక్నీషియన్ (క్యాటగిరి 2) మైంటెనర్: 18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.

అసిస్టెంట్ గ్రేడ్ 01(HR) & అసిస్టెంట్ గ్రేడ్ 01(F&A) & అసిస్టెంట్ గ్రేడ్ 01(C&MM): 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులలో అన్ రిజర్వుడు మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Selection Process: 


సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరి 1) డిప్లమా హోల్డర్స్ & సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరి 1) సైన్స్ గ్రాడ్యుయేట్స్: ఆన్లైన్ ఎగ్జామినేషన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

టెక్నీషియన్ (క్యాటగిరి 2) ప్లాంట్ ఆపరేటర్: ఆన్లైన్ ఎగ్జామినేషన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ప్రిలిమినరీ (stage-1), అడ్వాన్స్ టెస్ట్ (స్టేజ్-2) ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

టెక్నీషియన్ (క్యాటగిరి 2) మైంటెనర్ & అసిస్టెంట్ గ్రేడ్ 01(HR) & అసిస్టెంట్ గ్రేడ్ 01(F&A) & అసిస్టెంట్ గ్రేడ్ 01(C&MM): ఆన్లైన్ ఎగ్జామినేషన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ప్రిలిమినరీ (stage-1), అడ్వాన్స్ టెస్ట్ (స్టేజ్-2). స్కిల్ టెస్ట్

  ఉద్యోగులకు సంబంధించి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత క్యాటగిరి 1 ఉద్యోగాలకు అయితే నాలుగున్నర సంవత్సరాలు పనిచేస్తానని 4,47,000 రూపాయల బాండు రాయాలి. క్యాటగిరి 2 ఉద్యోగాలకు ఐదు సంవత్సరాలు పని చేస్తాను అని 5,07,000 రూపాయల బాండు రాయాలి.

Application Fee:


సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరి 1) డిప్లమా హోల్డర్స్ & సైంటిఫిక్ అసిస్టెంట్ (క్యాటగిరి 1) సైన్స్ గ్రాడ్యుయేట్స్: ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 150 రూపాయల నీ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

టెక్నీషియన్ (క్యాటగిరి 2) ప్లాంట్ ఆపరేటర్ & టెక్నీషియన్ (క్యాటగిరి 2) మైంటెనర్ & అసిస్టెంట్ గ్రేడ్ 01(HR) & అసిస్టెంట్ గ్రేడ్ 01(F&A) & అసిస్టెంట్ గ్రేడ్ 01(C&MM): ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయల నీ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

  మహిళలు, ఎస్సీ, ఎస్టి, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

Official Website: www.npcilcareers.co.in








కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు